బీచ్ ప్రాంతాలకు వెళ్లే సందర్శకులు సరదా కోసం వెళ్లి విషాదాన్ని వారి కుటుంబాలలో మిగిలించవద్దని పోలీసు అధికారులు చైతన్యపరుస్తున్నారు. సింగరాయకొండ మండలంలోని పాకల బీచ్, కొత్తపట్నం బీచ్, భైరవకోనలోని జలపాతం వద్దకు ప్రతి ఆదివారం సందర్శకులు అధిక సంఖ్యలో సందర్శిస్తుంటారు. గతంలో జరిగిన ఘటనలు దృష్టిలో ఉంచుకొని, తగిన జాగ్రత్తలు పాటిస్తూ, సరదాలు తీర్చుకోవాల్సిన అవసరముందని అధికారులు చెబుతున్నారు.