గుంటూరు నగరపాలక సంస్థకు పన్ను చెల్లింపుదారులకు వారికి అనువుగా సెలవు రోజుల్లోనూ కూడా నగదు కౌంటర్లు ఉంటాయని కమిషనర్ కీర్తిచేకూరి తెలిపారు. జీఎంసీ ప్రధాన సర్కిల్ కార్యాలయం తో పాటు భారత్ పేట 140, పెద్ద పలకలూరు 106, వసంత రాయపురం148 వార్డు సచివాలయాల్లో కౌంటర్లు పనిచేస్తాయన్నారు. ఆదివారం ఉదయం 8: 00 గంటల నుంచి రాత్రి 8: 00 గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. ఆస్తి, నీటి, ఖాళీ స్థలం పన్నులు, డిఅండ్వో ట్రేడ్ లైసెన్స్ ఫీజులు చెల్లించి నగర పాలక సంస్థ అభివృద్ధికి సహకరించాలని కోరారు.