తాడేపల్లిగూడెం కు చెందిన ఓ మహిళ (50) భర్తతో విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటోంది. పెళ్లి చేసుకోవాలని మధ్యవర్తికి తెలపగా తెనాలి కి చెందిన విశ్రాంతి సైనిక ఉద్యోగిని (66) పరిచయం చేశాడు. ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు ఆమె తెనాలిలోని అతని ఇంట్లో ఉంది. తిరిగి ఊరు వెళ్లిన సదరు మహిళా పెళ్లి చేసుకుందామని నమ్మకంగా పిలిచి అతని ఇంట్లో ఉన్న సమయంలో అత్యాచారం చేశాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.