వైఎస్ఆర్ ఆసరా పథకంలో భాగంగా మూడో విడత నిధుల విడుదల చేసేందుకు శనివారం ఏలూరు జిల్లా దెందులూరు వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) పూలమొక్క అందించి స్వాగతం పలికారు. ఎమ్మెల్యే డీఎన్నార్ తన తనయుడు దూలం వినయ్ కుమార్ తో కలిసి సీఎం జగన్ ను దుశ్శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డీఎన్నార్ మాట్లాడుతూ. నియోజకవర్గంలో పార్టీని మరింత పటిష్టవంతం చేయాలని సూచించారన్నారు. అలాగే, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తానని, నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చినట్టు ఎమ్మెల్యే డీఎన్నార్ పేర్కొన్నారు.