జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని జనసేన పార్టీ రాజంపేట అసెంబ్లీ ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమణ తెలియజేశారు. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావడం తధ్యం అని అన్నారు. ఆయన శనివారం రాజంపేటలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైసీపీకి చెంపపెట్టు అని అన్నారు. 2014 ఎన్నికలలో ఏ పదవిని ఆశించకుండా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పాటుపడ్డారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ తీరు పిచ్చోడి చేతిలో రాయిలా మారేందన్నారు.