ప్రముఖ ప్రసిద్ధి పేరుగాంచిన కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తుల రద్దీ పెరిగింది. ఈ సందర్భంగా టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఈ సందర్భంగా శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని 77, 856 మంది దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. అనంతరం శ్రీ స్వామివారిని 35, 783 మంది తలనీలాలు సమర్పించినట్లు అధికారులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి హుండీకి 3. 94 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు ఆదివారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు.