పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్షల పట్ల భయం వీడాలని, పరీక్షల సమయంలో మంచి పౌష్టికాహారం, వడదెబ్బకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని గర్భాo హైస్కూల్లో సోమవారం జరిగిన పదవ తరగతి వీడ్కోలు కార్యక్రమంలో జి. ఎస్. కాంతారావు సూచించారు. సదరు కార్యక్రమంలో సబ్జెక్టు ఉపాధ్యాయులు మాట్లాడుతూ వారి వారి సబ్జెక్టులలో విద్యార్థులకు వున్న సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా కొంతమంది ఉపాధ్యాయులు10 / 10 సాధించే విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను అందించనున్నట్లు తెలిపారు. మంచి మార్కుల సాధనకు ఇచ్చిన ప్రశ్నల ననుసరించి సరైన జవాబులను రాసే విధానానికి అవసరమైన మెళుకువలు, సలహాలను జీవశాస్త్ర ఉపాధ్యాయిని సీహెచ్. లక్ష్మీకుమారి విద్యార్థులకు తెలిపారు. విద్యార్థులకు, హాల్ టిక్కెట్లతో పాటు, ప్లాంకులు, పెన్నులు పాఠశాల సిబ్బంది అందించడమైనది.