బొబ్బిలి మండల ప్రజా పరిషత్ ఆఫీస్ ఆవరణంలో జరుగుతున్నటువంటి వైఎస్సార్ ఆసరా ఉత్సవాలు కార్యక్రమంలో పాల్గొన్న బొబ్బిలి శాసన సభ్యులు శంబంగి వెంకట చినఅప్పల నాయుడు ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 78. 94 లక్షల మంది పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో రూ. 6, 419. 89 కోట్ల మొత్తాన్ని జమ చేయనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి పొదుపు సంఘాల పేరిట మహిళలకు బ్యాంకుల్లో ఉన్న అప్పు మొత్తాన్ని సర్కారే చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళల పేరిట బ్యాంకుల్లో రూ.25, 571 కోట్ల అప్పు ఉంది. ఇప్పటికే రెండు విడతల్లో రూ. 12, 758. 28 కోట్లను ప్రభుత్వం జమ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు జమ చేయనున్న మొత్తం కలిపితే మూడు విడతల్లో రూ. 19, 178. 17 కోట్లను సర్కారు పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో జమ చేసినట్లు కానుందన్నారు అలానే బొబ్బిలి నియోజకవర్గం 3వ విడత కింద సుమారు 14కోట్ల 78 లక్షల రూపాయలును వారి ఖాతాలో జమచెయ్యటం జరిగింది. చేయూత, ఆసరా, సున్నా వడ్డీ పథకాలతో ఆర్థికాభివృద్ధికి కృషి చేశామన్నారు. అలానే 4వ విడత కూడా మీ అకౌంట్లో జమ అయినా తరువాతనే ఏప్రిల్ 2024 ఎన్నికలకు మన ముఖ్యమంత్రి వైళ్తారు అని చెప్పటం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ సావు వెంకట మురళీ కృష్ణ రావు, ఎమ్మెల్యే సోదరులు శంబంగి వేణు గోపాల్ నాయుడు , బుడా ఛైర్మన్ ఇంటి పార్వతి & గోపాల్ రావు , సర్పంచులు, , వార్డ్ కౌన్సిలర్స్, కోప్షన్ మెంబెర్స్, మున్సిపల్ కమిషనర్ , మెప్మ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.