దూర విద్యా కేంద్రం మూసివేసి జిల్లాలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో చదువుకుంటున్న విద్యార్థులకు ఆ విద్యను దూరం చేసే విధంగా ప్రభుత్వం పావులు కలపడం దారుణం అని, దీనిని తిరిగి ప్రారంభించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ సూర్య కుమారి వినతిపత్రంం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యురాలు సిహెచ్ పావని మాట్లాడారు జిల్లాలో గత 30 సంవత్సరాలుగా విద్యార్థులు ఈ దూర విద్యా కేంద్రం ద్వారా తమ విద్యను కొనసాగిస్తున్నారని, ఉత్తరాంధ్ర జిల్లాలలో అనేకమంది విద్యార్థులకు చదువు మరియు ఉపాధి ఒకేసారి చేయవలసిన ఆర్థిక పరిస్థితి రీత్యా దూరవిద్యా కేంద్రంలో అడ్మిషన్లు పొందుతూ తమ చదువును కొనసాగిస్తున్నారన్నారు. కానీ కారణమే లేకుండా మహారాజా కళాశాలలో ఉన్న దూర విద్యా కేంద్రం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉన్నఫలంగా ఎత్తివేయడాన్ని విజయనగరం జిల్లా కమిటీగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఎంఆర్ కళాశాలలో ఉన్న దూర విద్యా కేంద్రాన్ని తిరిగి ప్రారంభించే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజానీకాన్ని, విద్యార్థులను ఏకం చేసి ఉద్యమం చేస్తామని దీనికి ప్రభుత్వమే బాధ్యత వాయించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు డి రాము, ఎం సౌమ్య తదితరులు పాల్గొన్నారు.