తన కుమారుడ్ని అనారోగ్యం నుండి కాపాడుకునేందుకు ఓ తండ్రి 10 ఏళ్ల బాలుడిని నరబలి ఇచ్చాడు. యూపీలోని బహ్రైచ్ జిల్లా పర్సాకు చెందిన అనూప్ కు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆ బాలుడి ఆరోగ్యం సరిగా ఉండేది కాదు. దీంతో ఓ తాంత్రికుడి సూచన మేరకు తన బంధువు కృష్ణ వర్మ కుమారుడైన పదేళ్ల బాలుడిని నిర్మాణుష్య ప్రాంతంలో నరబలి ఇచ్చాడు. కృష్ణ వర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టి అనూప్ ను అరెస్ట్ చేశారు.