సేంద్రీయ వ్యవసాయం కాలుష్య నివారణకు ఉపయోగపడుతుంది. సహజ వనరులు ఉపయోగపడటమే గాక రాబోయే తరాలకి, అందుబాటులో ఉంటాయి. నేలలో తేమ గాలి, మొక్క సంబంధాలలో అనుకూలత పెరుగుతుంది. వేర్లు బాగా లోపలికి చొచ్చుకుపోయే లక్షణం కలిగి ఉంటాయి. మొక్కికి పోషకాలు పుష్కలంగా అందుతాయి. ఆహారంలో విషపదార్ధాలు ప్రవేశించే అవకాశం ఉండదు. నేల వల్ల అందే పోషకాలు పూర్తిగా మొక్కలకు చేరతాయి. నేల పునరుద్దరణ జరుగుతుంది.