తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వేములూరు ఉప సర్పంచ్ సత్య వరప్రసాద్(51) ఆదివారం ఉదయం ఇంటి వరండాలో విగతజీవిగా కనిపించారు. మృతదేహంపై గాయాలు ఉండడంతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. అర్ధరాత్రి 1 గంట తర్వాత వరప్రసాద్ ఇంట్లో నుంచి అరుపులు వినిపించాయని స్థానికులు తెలిపారు. వరప్రసాద్ ను హత్యచేసిన వారిని కఠినంగా శిక్షించాలని మాజీ మంత్రి జవహర్ డిమాండ్ చేశారు.