శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 1 నుంచి నడకదారి భక్తులకు దివ్య దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్టు TTD ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. అలిపిరి నడకదారిలో రోజుకు 10వేల టోకెన్లు, శ్రీవారి మెట్టు నడకదారిలో రోజుకు 5వేల టోకెన్లు జారీ చేస్తామని చెప్పారు. వేసవిలో బ్రేక్ దర్శనాలను తగ్గిస్తామన్నారు. కాగా కరోనా నుంచి నడకదారి భక్తులకు దివ్యదర్శన టోకెన్లు రద్దు చేసిన విషయం తెలిసిందే.