చాలామందికి నిద్రలో గురక పెట్టే అలవాటు ఉంటుంది. అయితే గురక కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీయొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గురక తగ్గించుకునేందుకు కంటిన్యువస్ పాజిటివ్ ఎయిర్ వే ప్రెజర్ (CPAP) చికిత్స ఉంటుంది. నిద్రించేటప్పుడు ముక్కు, నోరు కవరయ్యేలా ఒక మాస్క్ ధరించాలి. దీనికి అనుసంధానంగా ఒక మిషన్ ఉంటుంది. ఇది గురక బాధితుల శ్వాసనాళాలు తెరుచుకునేలా సాయపడుతుంది. దీంతో శ్వాస తీసుకోవడం తేలికవుతుంది.