దోర్నాల మండలంలోని స్వయం సహాయక గ్రూపులకు మూడో విడత జగనన్న ఆసరా నగదు విడదలైనట్లు ఏపీఎం పోలయ్య తెలిపారు. 573 గ్రూపులకు సంబంధించి 5, 649 మంది సభ్యులకు మూడు కోట్ల 10 లక్షల 4 వేల 914 రూపాయలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఈ నెల 31వ తేదీన ఎర్రగొండపాలెంలో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ చేతుల మీదుగా స్వయం సహాయక సంఘాలకు అందజేయనున్నట్లు వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa