ఈనెల 29న కృష్ణా జిల్లా వ్యాప్తంగా ప్రజారోగ్యానికి, పంటల ఎదుగుదలకు ఆటంకంగా ఉన్న కలుపు మొక్కలను సమూలంగా నిర్మూలించేందుకు నిర్వహించనున్న అవగాహన కార్యక్రమ విజయవంతానికి అధికారులు భాగస్వామ్యులు కావాలని కలెక్టర్ దిల్లీరావు కోరారు. సోమవారం ‘పార్థీనియం కలుపుమొక్కను నిర్మూలిద్దాం, ఆరోగ్యాన్ని సంరక్షిద్దాం, పంటలను పరిరక్షిద్దాం’ అవగాహన పోస్టర్‌ను అధికారులతో కలిసి విడుదల చేశారు. 29వ తేదీన జిల్లా వ్యాప్తంగా పార్థీనియం మొక్కలను గుర్తించి కూకటి వేళ్లతో పెకలించి వాటిని దహనం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుధ్య కార్మికులు, ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అనుబంధ శాఖ అధికారులు, సిబ్బందితో పాటు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, స్వయంసహాయక సంఘ సభ్యులు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు.