చినగంజాం మండలంలోని కడవకుదురు గ్రామ పరిధిలో 30వ విడత జాతీయ గాలి కుంటు వ్యాధి నివారణ కార్యక్రమం లో భాగంగా సోమవారం 102 గేదెలకు, 34 దూడలకు ఉచితంగా టీకాలు వేశారు. జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి డాక్టర్ మద్దు హనుమంతరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. రైతులకు గాలి కుంటు వ్యాధి లక్షణాలు, నివారణ, టీకాల ఆవశ్యకత గురించి అవగాహన కల్పించారు. గ్రామ సర్పంచ్ గొల్లముడి శివ కుమారి, ఉప సర్పంచ్ నక్కల శ్రీనివాస రావు, చీరాల పశు వైద్యుడు డాక్టర్ సజ్జా చిట్టి బాబు, సంతరావూరు పశు వైద్యుడు డాక్టర్ తాటిపర్తి శివారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.