సోమవారం కాకినాడ కలెక్టరేట్లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఒక ఆవేదన పరమైన ఫిర్యాదు అందింది. వైసీపీ సర్పంచ్ భర్త రూ.24 లక్షలు కాజేశాడని అందులో పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్ళితే.... తొండంగి మండలం కోదాడలో కోన ఫారెస్ట్ భూములను పోర్టు నిర్మాణం కోసం సెజ్ అధికారులు తీసుకున్నారు. ఎకరాకు రూ.10 లక్షల చొప్పున పరిహారాన్ని రైతుల ఖాతాల్లో వేశారు. ఆ డబ్బు వారి ఖాతాల్లో పడగానే కోదాడ సర్పంచ్ మూర్తి రత్నకుమారి భర్త మూర్తి నాని బ్యాంక్ అధికారుల సహకారంతో రూ.24 లక్షలు కాజేశాడు భాదితులు పేర్కొన్నారు. విచారణ చేపట్టి న్యాయం చేస్తామని కలెక్టర్ కృతికా శుక్లా హామీ ఇచ్చారు.