పల్నాడు జిల్లా గురజాల మండలం, గంగవరంని అక్షయ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు గుండాల మల్లీశ్వరి, టీడీపీలో చేరినందుకు వైసీపీ నేతలు తనను బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం మల్లీశ్వరి మాట్లాడుతూ..... తాను 11 ఏళ్లుగా వైసీపీ అభిమానిగా ఉన్నానని, వైసీపీ తలపెట్టిన కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నానని చెప్పారు. అయితే వైసీపీ ప్రభుత్వ ఏర్పడిన తరువాత రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు తనను కలిచివేశాయని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కేవలం చంద్రబాబుతోనే సాధ్యమని నమ్మి టీడీపీలో చేరినట్లు వివరించారు. అయితే ఒక్క రోజు కూడా గడవక మునుపే వైసీపీ మూకలు దౌర్జన్యానికి పాల్పడడం బాధేస్తుందని తెలిపారు. తాను గతంలో వైసీపీ అభిమానిగా ఉన్న విషయాన్ని సైతం మరిచి, మహిళను అని కూడా చూడకుండా ఇలా వేధిస్తున్నారంటూ కన్నీరు పెట్టుకున్నారు.