పశ్చిమ బెంగాల్ నుంచి వైద్యం కోసం పుట్టపర్తికి వచ్చిన సమర్ నాథ్ ముఖర్జీ (71) అనారోగ్యంతో మృతి చెందారు. అంత్య క్రియలు నిర్వహించేందుకు స్థానిక ముస్లిం యువత ముందుకొచ్చింది. ఖిద్మత్-ఎ-ఖల్క్ చారిటిబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో షామీర్, షేక్షా వలి, అలీ, షాకీర్, చాంద్, అమృత వాటర్ మారుతి సమకూర్చిన వైకుంఠ రథంలో మృత దేహాన్ని తరలించి శ్మశాన వాటికలో హిందూ సంప్రదాయ రీతిలో అంత్యక్రియలను పూర్తి చేసి సేవా నిరతిని చాటుకున్నారు. వీరి సేవ లను పట్టణ వాసులు కొనియాడారు.