ప్రాచీన గుత్తి కోటను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని మాజీ సైనిక ఉద్యోగ సంఘం పేర్కొంది. మంగళవారం గుత్తి కోట వద్ద మాజీ సైనిక ఉద్యోగులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుత్తి కోటలో తవ్వకాలలో కూలి పోయిన కట్టడాలను పురావస్తు శాఖ అధికారులు వెంటనే మరమ్మతులు చేయించాలని అన్నారు. ఈ కోటను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేం దుకు ప్రభుత్వాలు కృషి చేయాలని అన్నారు. కోటను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. కోటను పర్యాటక కేంద్రంగాఅభివృద్ధి చేస్తే కొంత మేరకైనా నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు. ఈ సమా వేశంలో మాజీ సైనిక ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రామ్మూర్తి, కృష్ణయ్య సభ్యులు కృష్ణా రావు, లక్ష్మీపతి, దస్తగిరి, గుత్తి కోట పరిరక్షణ సమితి సభ్యులు విజయ్ భాస్కర్, హర్షద్ తదితరులు పాల్గొన్నారు.