మద్దిపాడు మండలం మద్దిపాడు గ్రామంలో పోలీస్ స్టేషన్ కూత వేటు దూరంలో 25 లక్షల విలువైన సొత్తు అపహరణకు గురైన సంఘటన మంగళవారం వెలుగు చూసింది. స్థానిక పెట్రోల్ బంకు యజమాని అయిన రాంబాబు శోభారాణి సోమవారం రాత్రి విధులు ముగించుకొని తమ ఇంటి రెండో అంతస్తులు నిద్రించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత పై అంతస్తుకు వచ్చిన దొంగ పై అంతస్తుకు చేరి గుట్టు చప్పుడు కాకుండా కిటికీలోనుంచి ప్రవేశించి బీరువాలో ఉన్న సుమారు 22 లక్షలు విలువైన 30 సవర్ల బంగారం మరియు కొన్ని వజ్రాభరణాలతోపాటు మూడు లక్షల నగదును తీసుకొని పరారయ్యాడు. మంగళవారం ఉదయం దొంగతనాన్ని గుర్తించిన దంపతులు పోలీసులకు సమాచారం అందించారు. ఏ ఎస్పీ శ్రీధర్, డి. ఎస్. పి నాగరాజు, ఎస్సై శ్రీరామ్ సంఘటనా స్థలానికి చేరుకొని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్ సిబ్బంది ఆధారాల సేకరించారు.