ప్రభుత్వ ఉద్యోగుల జీతాల భట్వాడాపై చట్టం చేసే వరకు విశ్రమించేది లేదని, అవసరమైతే సమ్మెకైనా సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ తేల్చి చెప్పారు. ఈనెల 30లోగా సమస్యలు పరిష్కరించకపోతే ఏప్రిల్ 2వ వారంలో రాజమండ్రిలో జరగనున్న రాష్ట్ర స్థాయి సమావేశంలో భవిష్యత్ నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కార్‌రావు తదితరులు పాల్గొన్నారు.