వలేటివారిపాలెం మండలంలో గల మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం చైర్మన్ గా బీసీలకు కేటాయించాలని బిజెపి పట్టణ అధ్యక్షులు పివి రమేష్ బుధవారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. చైర్మన్ పదవి ఇవ్వకుండా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం బీసీల మీద కపట ప్రేమ చూపిస్తూ వారి ఓట్లను లాక్కుంటూ అధికారం అందుకుంటున్నారని ఆరోపించారు. అధికారంలో ఉన్నటువంటి వైసిపి బీసీల పైన మరొకసారి కపటం చూపిస్తూ మాల్యాద్రి లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ గా బీసీలను ఎందుకు కేటాయించడం లేదని ఆయన విమర్శించారు.