ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా వంద రూపాయల ప్రత్యేక నాణెం విడుదల చేయడంపై ప్రధాని మోదీకి టీడీపీ అధినేత చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రధానికి మంగళవారం లేఖ రాశారు. ‘నాణెం విడుదల విషయంలో చొరవ తీసుకొన్న కేంద్ర ప్రభుత్వానికి... ప్రత్యేక శ్రద్ధ తీసుకొన్న మీకు ధన్యవాదాలు. ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక. ఎన్టీఆర్ను సన్మానించడం అంటే తెలుగువారిని గౌరవించడమే. ఆయన జ్ఞాపకార్థం నాణెం విడుదల చేయడం సముచిత నిర్ణయం. ఇందుకుగాను.. మీకు తెలుగు ప్రజల తరఫున, మా పార్టీ తరఫున అభినందనలు’ అని ఆ లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు