కడప జిల్లా పులివెందులలో నిన్న కాల్పులు ఘటన కేసులో కీలక పరిణామం చోటు చేసుకొంది. ఇదిలావుంటే ఈ కాల్పుల ఘటనలో దిలీప్ అనే వ్యక్తి మృతి చెందాడు. కాల్పులు జరిపిన భరత్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి పరారయ్యాడు. అయితే, నిందితుడు భరత్ నేడు పోలీసులు ఎదుట లొంగిపోయాడని డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు. పులివెందుల కాల్పుల ఘటనపై డీఎస్పీ నేడు మీడియా సమావేశం నిర్వహించారు. ఆర్థిక లావాదేవీల కారణంగానే హత్య జరిగిందని వెల్లడించారు. నిందితుడి నుంచి తుపాకీ, రెండు తూటాలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. మృతుడు దిలీప్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్టు డీఎస్పీ వెల్లడించారు.