తమిళనాడులో ఓ ఐపీఎస్ అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. తిరునల్వేలి జిల్లా అంబాసముద్రం ఏఎస్పీ బల్వీర్ సింగ్ 10 రోజుల క్రితం ఓ దాడి కేసులో ఐదుగురిని అరెస్టు చేశారు. బల్వీర్ సింగ్ కటింగ్ ప్లేయర్ తో పళ్లు పీకారని, తమలో కొత్తగా పెళ్లైన వ్యక్తి మర్మాంగాలపై దాడి చేశారని వారు వీడియో విడుదల చేశారు. దీంతో ఆ అధికారిపై ప్రభుత్వం వేటు వేసింది. విచారణ అనంతరం ఐపీఎస్ పై పూర్తిస్తాయి చర్యలు ఉంటాయని సీఎం తెలిపారు.