యూకే ప్రభుత్వం ఓటీటీ కంటెంట్ పై కీలక నిర్ణయం తీసుకుంది. ఓటీటీ కంటెంట్ ను సెన్సార్ చేసేందుకు ముసాయిదా రూపొందించింది. ఈ ముసాయిదాకి ఆమోదం లభిస్తే అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, డిస్నీ హాట్ స్టార్ సహా ప్రముఖ ఓటీటీ వేదికల్లో ప్రసారమయ్యే ప్రతి కంటెంట్ కు సెన్సార్ చేస్తారు. నిబంధనలు అతిక్రమించిన కంటెంట్ కు 250,000 పౌండ్లు(రూ. 2 కోట్లు) జరిమానా విధించనున్నారు.