పాకిస్థాన్ లో పరిస్థితులు అత్యంత దారుణంగా మారుతున్నాయి. పంజాబ్ ప్రావిన్స్ జిల్లాల్లో పేదలకు ఉచితంగా గోధుపపిండి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి వద్దకు భారీగా ప్రజలు రావడంతో తొక్కిసలాట జరిగి ఇప్పటివరకు 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం రోజే ముగ్గురు చనిపోయారు. పాక్ లో ఆర్థిక సంక్షోభంతో నిత్యావసరాల ధరలు భారీగా పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.