కర్ణాటక ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. దీనిలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించింది. అధికారంలోకి వస్తే నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్, స్థానికులకు ఉద్యోగుల్లో 80 శాతం, మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు వంటి 10 కీలక హామీలను మేనిఫెస్టోలో ప్రకటించారు. కర్ణాటకలో మే 10న ఎన్నికలు జరగనున్నాయి.