ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి ప్రసిద్ధ పేరుగాంచిన కలియుగ వైకుంఠ తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ సందర్భంగా టోకెన్ లేని భక్తులకు కల్పించే సర్వదర్శనానికి 16 గంటలు క్యూ లైన్ లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మేరకు శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం కోసం 10 కంపార్ట్మెంటులో భక్తులు వేచి ఉన్నట్లు టీటీడీ అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా టిటిడి అధికారులు మాట్లాడుతూ. బుధవారం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని 64, 754 మంది దర్శించుకున్నట్లు తెలియజేశారు. అనంతరం శ్రీ స్వామి వారిని 24, 144 మంది తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి బుధవారం హుండీకి 4. 76 కోట్లు ఆదాయం వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు. ఈ మేరకు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గురువారం శ్రీరామనవమి సందర్భంగా అధిక భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి రానున్న నేపద్యంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలను చేపడుతున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.