అనంతపురం జిల్లా, వజ్రకరూరు మండలంలోని వెంకటాంపల్లి తండాలో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్ళితే.... రెండేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు నీటి తొట్టెలో పడి పోయాడు. బాలుడు ఎంతసేపటికి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు చుట్టుపక్కల గాలించారు. నీటి తొట్టెలో పడి ఉండటం గమనించిన కుటుంబసభ్యులు బయటకు తీసి 108 వాహనానికి సమాచారాన్ని అందించారు. బాలుడిని హుటాహుటిన ఉరవ కొండ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.