పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం గ్రామంలో క్రౌంచగిరి పుణ్యక్షేత్రం కొండపై అక్రమార్కులు కన్నేశారు. కొండకు వాయువ్య భాగాన వందలసంఖ్య లారీలతో గ్రావెల్ క్వారీయింగ్ చేసి తరలిస్తున్నారు. గతంలో కృష్ణానదికి వరదలు వచ్చిన సమయంలో ఈ క్రౌంచగిరి తుళ్లూరు మండలంలోని గ్రామాలకు ముంపు వాటిల్లకుండా రక్షణ గోడగా నిలిచింది. వైకుంఠపురం ఇసుకరీచ్ అనుమతి పొందిన కాంట్రాక్టర్లు, అధికారపార్టీ నాయకులు ఇసుకరీచ్‌లో రహదారుల నిర్మాణానికి ఈ కొండ నుంచి గ్రావెల్ తవ్వి తరలిస్తున్నారు. అయితే గత కొన్నినెలలుగా ఇసుకరీచ్ నిర్వహిస్తున్న సంస్థ ప్రతినిధులు, ప్రస్తుతం రీచ్ నిర్వహిస్తున్న అధికారపార్టీ నాయకులు కొండను ఎక్స్‌వేటర్స్‌తో గ్రావెల్‌ను తవ్వి నదిలో వాహనాల రాకపోకలకు తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa