రైతాంగ సమస్యలపై నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుగురైతు విభాగం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి రాజేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు, పిట్టలవారిగూడెం ఎత్తిపోతల పథకం పూర్తికి ప్రభుత్వంపై ఒత్తిడి, రైతులకు చెల్లించాల్సిన ధాన్యం నగదు, ఇన్పుట్ సబ్సిడీ సమస్యలపై చర్చిస్తామని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్, మాజీ మంత్రి దేవినేని ఉమా పాల్గొంటారని తెలిపారు.