‘మీరు చేసింది ముమ్మాటికీ తప్పే.. అది జగమెరిగిన సత్యం.. అధిష్ఠానం తీసుకొన్న నిర్ణయం సబబే.. మీకు ఇక్కడ స్థానం లేదు.. నియోజకవర్గం వదిలి వెళ్లిపోండి.. లేదంటే తరువాత జరిగే పరిణామాలకు ఎవరూ బాధ్యులు కారు’... అంటూ కొట్టాలపల్లి సొసైటీ మాజీ అధ్యక్షుడు మూలె వినయ్‌రెడ్డి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిని హెచ్చరించారు. గురువారం ఉదయం పట్టణంలో వైసీపీ నాయకులు మేకపాటి ద్రోహి.. ఉదయగిరి వదిలి వెళ్లిపో.. అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ చేపట్టారు. కాగా తాము ర్యాలీ ముగించుకొని భోజనానికి వెళ్లాక వచ్చి ఉదయగిరిలో ఉన్నా.. రండి దమ్ముంటే చూసుకొంటామని మేకపాటి అన్నారని మూలె తెలిపారు. మీకు దమ్ముంటే ఉంటే రండి కర్రలతో వస్తారో.. బాంబులు తెస్తారో తేల్చుకొందాం..ఆయన సవాల్ విసిరారు.