ఏపీకి అన్నపూర్ణగా దేశంలో ప్రత్యేకత ఉండేదని... కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి అని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి అన్నారు. ఏపీలో ఆర్ధిక ఎమెర్జెన్సీ వచ్చే అవకాశం ఉందని.. అందుకు కారణం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో మాత్రమే జగన్కు ఢిల్లీలో అపాయింట్మెంట్లు లభిస్తున్నాయని వివరణ ఇచ్చారు. జగన్తో కానీ, ఆయన పార్టీతో కానీ బీజేపీకి స్నేహ సంబంధాలు లేవన్నారు. బీజేపీ - వైఎస్సార్ పార్టీల మధ్య సంబంధాలు కేవలం కేంద్ర - రాష్ట్రాల మధ్య ఉన్న సంబంధాలు మాత్రమే అని తేల్చిచెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఫాన్కు ఎదురుగాలి వీయడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు.