వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి రెక్కల కష్టంతో గెలిచి.. పార్టీపై, సీఎం వైయస్ జగన్ ఆరోపణలు చేస్తున్న మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే ఉదయగిరి రావాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. ఉదయగిరి బస్టాండ్ సెంటర్లో బైఠాయించారు. చంద్రశేఖర్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి సవాల్ విసిరి పారిపోయారని, ఉదయగిరి వచ్చి తన దమ్ము ఏంటో నిరూపించుకోవాలని సవాల్ విసిరారు.