మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సుప్రీం కోర్టు మార్చినట్లు సీబీఐ కోర్టుకు సీబీఐ ప్రత్యేక పీపీ తెలిపారు. సీబీఐ స్పెషల్ పీపీకి సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వైఎస్ వివేకా కుమార్తె సునీతా రెడ్డి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో తదుపరి విచారణను సీబీఐ కోర్టు వచ్చే నెల 28కి వాయిదా వేసింది.