రాజధాని అమరావతి కోసం రైతులు చేపట్టిన ఉద్యమం 1200 రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ రైతుల దీక్షా శిబిరానికి చేరుకుని రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. అనంతరం మాట్లాడుతూ... ప్రస్తుత అధికార పార్టీ తప్ప అన్ని పార్టీలు అమరావతి కోరుకుంటున్నారన్నారు. ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన జగన్ రాష్ట్ర భవిష్యత్తును కట్ట గట్టి కృష్ణాలో పారేశారని విమర్శించారు. జగన్‌కు మూడు రాజధానులు కట్టాలని లేదని... కేవలం దేశంలోనే అత్యంత ధనికుడు అయిన నాయకుడు కావాలని... దానికి ఉదాహరణ ఇసుక పాలసి, రాజధాని అని చెప్పుకొచ్చారు. విశాఖ వడ్డించిన విస్తరిలా ఉందని... లా వుంది దోచుకోవడానికే విశాఖ రాజధాని అంటున్నారని మండిపడ్డారు. ‘‘గతంలో విజయనగరం వెళ్లిన సమయంలో మీ ప్రాంతానికి రాజధాని వస్తుందని చెప్పగా.. వాళ్ళు మాకు ఈ దోపిడీ తెచ్చే రాజదాని వద్దు అన్నారు’’ అని టీడీపీ నేత తెలిపారు.