గోంగూర ప్రకృతి ప్రసాదమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. గోంగూరలోని ఫైబర్ వల్ల జీర్ణక్రియ సమస్యలు, మలబద్దకం, డయేరియా తగ్గుతాయని, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు. శరీరంలో మలినాలు తొలగుతాయంటున్నారు. గోంగూరలోని విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని, అలాగే ‘రే చీకటి’ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు. రక్తహీనత సమస్య తగ్గిస్తుందని చెబుతున్నారు.