ఆంధ్రప్రదేశ్ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్పై అమరావతిలో జరిగిన దాడి విషయాన్ని రఘురామ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ సీఎం జగన్ ప్రోద్బలంతో సత్యకుమార్పై దాడి జరిగిందని ఆయన లేఖలో పేర్కొన్నారు. దాడి జరిగిన విషయం పోలీసులకు తెలిసినా పట్టించుకోలేదని ప్రధానికి వివరించారు.ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈరోజు అమరావతిలో రైతులకు మద్దతుగా బీజేపీ నేత సత్యకుమార్ వస్తుండగా, ఆయన కారును అడ్డుకున్న ఆందోళనకారులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.