చిన్న మొత్తాల పథకాల్లో పొదుపు చేసుకునే వారికి ఊరటనిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చిన్నమొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం సవరించింది. వడ్డీ రేట్లను 70 బేసిక్ పాయింట్ల వరకు పెంచింది. దీంతో సీనియర్ సిటిజన్ల పొదుపు పథకాలు, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాల వడ్డీ రేట్లు మారనున్నాయి. ఇవాళ్టి నుంచే ఈ కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి వచ్చాయి.