ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఓ ఇంట్లో నిర్వహిస్తున్న కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి మృతుల శరీరాలు ముక్కలు ముక్కలై.. చెల్లచెదురుగా పడ్డాయి. మరికొందరి శరీర భాగాలు శిథిలాల కిందే చిక్కుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa