పాకిస్థాన్లో ఆర్థిక సంక్షోభం నానాటికీ పెరిగిపోతుంది. తాజాగా కరాచీలో ఓ ఆహార పంపిణీ కేంద్రం వద్ద శుక్రవారం జరిగిన తొక్కిసలాటలో 12 మంది మృతి చెందారు. రంజాన్ సందర్భంగా ఆహారం పంపిణీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు.. పొరపాటున కరెంటు తీగపై కాలు వేయడం వల్ల షాక్ గురయ్యారు. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు పరుగు తీయడంతో ఈ దుర్ఘటన జరిగింది. మృతుల్లో చిన్నారులు, మహిళలే ఎక్కవగా ఉన్నారు.