సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పుట్టపర్తి అభివృద్ధిపై ప్రమాణం చేద్దామని సవాల్ చేసుకొని సత్తమ్మ తల్లి దేవాలయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. తోపులాటలో పల్లె రఘునాథ్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో పోలీసులు లాఠీఛార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.