దేశంలో అక్రమ ఆయుధాల వినియోగం బాగా పెరిగిపోయింది. దుండగులు అక్రమ ఆయుధాలతో దోపిడీలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. మోతిహరిలోని ఓ గ్యాస్ ఏజెన్సీలోకి ముగ్గురు దుండగులు ముసుగులు ధరించి ప్రవేశించారు. తుపాకీలతో సిబ్బందిని బెదిరించి భారీ మొత్తంలో నగదును దోచుకెళ్లారు. దోపిడీ చేస్తున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.