రాష్ట్ర డిజిపి కె. వి. రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో ఏర్పాటు చేసిన కోర్టు మానిటరింగ్ సిస్టం ద్వారా ఎస్సైలు, సి. ఐ లు, డీఎస్పీలు స్వయంగా పర్యవేక్షించడం వల్ల దోషులకు కఠిన శిక్షలు పడుతున్నాయి అని శనివారం అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా జిల్లాలో ఇంకా పలు కేసులు కోర్టు ట్రయిల్స్ జరుగుతున్నాయి అని అన్నారు. వాటిలో కూడా కోర్టు మానిటరింగ్ సిస్టం ద్వారా సంబంధిత పోలీసు అధికారులు పర్యవేక్షించి నిందితులకు శిక్షలు పడి బాధితులకు న్యాయం జరిగేలా ప్రాపర్ గా చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.