టీచర్లను పరీక్షల సమయం లో తహసీల్దార్ ఆఫీస్ లో రిపోర్ట్ చేసుకోవాలని ఉన్నత విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు ఇచ్చి టీచర్లను సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరించడం సరైనది కాదని, ఈ ఉత్తర్వులు వెంటనే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ డిమాండ్ చేసారు. ఈ మేరకు శనివారం అనంతపురంలో ఒక ప్రకటన విడుదల చేశారు. అలాగే గత సంవత్సరం పదవ తరగతి ఇన్విజిలేషన్ డ్యూటీ లో తప్పు చేసారని ఇప్పుడుకూడా ఇలాంటి చర్యలకు పాల్పడితే ఏపి ఎస్ ఈ ఏ ఉపాధ్యాయుల పక్షాన నిలబడి ఉద్యమిస్తుందని తెలియచేశారు.