ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అడుసుమల్లి గ్రామంలో చోరీ, నగలు అపహరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 01, 2023, 11:32 AM

పర్చూరు మండలం అడుసుమల్లి గ్రామంలోని తన ఇంట్లో చోరీ జరిగినట్లు ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు పై పోలీసులు శుక్రవారం రాత్రి కేసు నమోదు చేశారు. తామంతా మార్చి రెండో తేదీ నుండి 30వ తేదీ వరకు ఊర్లో లేమని, శుక్రవారం ఇంటికి తిరిగి వచ్చేసరికి దొంగతనం జరిగిపోయిందని అమరా చింతయ్య అనే వ్యక్తి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇంటి ప్రధాన ద్వారం తాళాలు పగలగొట్టి లోన ప్రవేశించిన దొంగలు బీరువాలో ఉన్న 90 వేల రూపాయలు చేసే బంగారు వెండి ఆభరణాలను అపహరించుకుపోయారని అతను తెలిపాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పర్చూరు ఎస్సై ప్రసాద్ చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com