‘నేను పేదల ప్రతినిధి... చంద్రబాబు ధనికుల ప్రతినిధి’ అని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యను మీడియా ప్రతినిధులు ప్రస్తావించినప్పుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ‘‘ఇసుకలో నెల కు రూ.250 కోట్లు దోచుకొంటున్నవాడు పేదల ప్రతినిధా? నెలనెలా ఇంత డబ్బు ఇవ్వలేక గోదావరి జిల్లాలో ఒక కంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకొన్నాడు. ఇసుకలో ఇంత డబ్బు ఉంటుందని కూడా మాకు తెలియదు. ఇంత డబ్బు వీళ్లు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? దేశంలోని ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులందరి ఆస్తులు కలిపినా ఈయన ఆస్తులంత లేవు. ఈయన పేదల ప్రతినిధా?’’ అని ప్రశ్నించారు.